నా మొదటి పుటలో (home page) నా కొత్త కవితలను మాత్రమే ఉంచుతున్నాను. ఇతర కవితలను చదవాలంటే “నా మొత్తం కవితలు” క్లిక్ చేయండి.
౧౧. మానవుడు – దానవుడు
ప్రతి మనిషిలో రాముడున్నాడు; రావణుడున్నాడు
అహాన్ని జయించిననాడు రాముడు అవుతాడు
ప్రతి మనిషిలో సీతా ఉంది; శూర్ఫనఖ ఉంది
సహనం కోలుపోనినాడు సీత ఆవిష్కరింపబడుతుంది
ప్రతి మనిషిలో కృష్ణుడున్నాడు, కంసుడు ఉన్నాడు
మంచి తెలుసుకొన్న వాడే కృష్ణుడు అవుతాడు
ప్రతి మనిషిలో వామనుడున్నాడు; బలి చక్రవర్తీ
ఉన్నాడు
చెడుకి అండగా లేనప్పుడు వామనుడిలా జయిస్తాడు
ప్రతి మనిషిలో ప్రహ్లాదుడున్నాడు; హిరణ్యకశపుడు
ఉన్నాడు
ద్వేష బావం తగ్గిననాడే హరి కనిపిస్తాడు
ప్రతి మనిషిలో నరుడున్నాడు; నారాయణుడున్నాడు
ఈ జీవితసత్యం అర్ధం అయితే; నరుడే నారాయణుడు
అవుతాడు
-------------------- అర్జున