అరిషడ్వర్గ సమాజం

ఈ సమాజంలో మదమెక్కిన కొందరికి  
కామ పిశాచి ఆవహించింది
తల్లికి, చెల్లికి చివరకు బిడ్డకు తేడా లేకుండా  చెరుస్తున్నారు

అహంకారం తలకెక్కిన కొందరు ప్రభువులు
లాభాపేక్షతో లోభులుగా మారినారు
ఓట్లు వేసిన ప్రజలను బానిసలుగా చేస్తున్నారు

మద మాత్స్తర్యాలు అంటించుకొన్న మరికొందరు
అధికార మొహానికి ప్రతీకలైనారు
ప్రజల మధ్య క్రోధాగ్ని రగిలిస్తున్నారు

అరిషడ్వర్గాలను జయించే మార్గం చూపాల్సిన గురువులు
తమ తమ ప్రభ ప్రాభవం కోసం కుమ్ములాడుతున్నారు
ఇప్పటికైతే ఇది అరిషడ్వర్గ విజయం... మారుతుందా ఎప్పటికైనా ఈ సమాజం? 
                                          --------------------- అర్జున