తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండు తెలుగొకండ
ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స !!
దేశ భాషలందు తెలుగు లెస్స !!
శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన ఈ పద్యం తో నా బ్లాగ్ ని మొదలు పెడుతున్నాను.
ఎందఱో చెప్పినట్టుగా తెలుగు ఎంతో మధురమైన భాష. మరి మన భాషను మనం మాట్లాడడానికి ఎందుకు వెనుకాడుతున్నాం? పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు తెలుగు మాట్లాడితే సిగ్గుచేటు అనుకుంటున్నారు.. అసలు తెలుగు వాళ్ళమై తెలుగు మాట్లాడక పోవడానికి సిగ్గు పడాలి.
అసలే ఈతరంలో చాలా మందికి తెలుగు చదవటం మరియు రాయటం రాదు.. మరి మన మొహమాటం వల్ల మరియు సిగ్గు వల్ల రాబోయే తరానికి తెలుగు తియ్యదనం తెలీకుండా చేస్తున్నామా?
ఎందఱో చెబుతున్నట్టు మన మాతృ భాష మన వల్లే మృత భాషగా మారుతోందా? ఇలాగే కొనసాగితే కొన్ని తరాల (నా ఉద్దేశం 2 లేదా 3 తరాలు అని) తరువాత స్వచ్చమైన తెలుగు కాదు సరి కదా అసలు తెలుగే లేకుండా పోతుందేమో?
మీ అభిప్రాయాలను ఇక్కడ తెలపండి.