మనిషి ఓ మనిషి! నీది ఒక జన్మేనా
జ్ఞానం
గొప్పదంటావు
ధనం
తుచ్చమంటావు
ధనంకోసం
జ్ఞానాన్నే త్యజిస్తావు
మనిషి ఓ
మనిషి! నీది ఒక జన్మేనా
స్నేహం
గొప్పదంటావు
ప్రేమ పవిత్రమైనదంటావు
స్నేహం ప్రేమ
మధ్య తేడా తెలుసుకోలేవు
మనిషి ఓ
మనిషి! నీది ఒక జన్మేనా
ఎంతో
సాదించాలనుకుంటావు
సంపాదన
ముఖ్యం కాదంటావు
సంపాదన
ధ్యాసలో సాధన మరుస్తావు
మనిషి ఓ
మనిషి! నీది ఒక జన్మేనా
తల్లే
దేవతంటావు
ప్రేయురాలే
ఇష్టం అంటావు
ప్రియురాలి
ధ్యానంలో తల్లినే చులకన చేస్తావు
మనిషి ఓ
మనిషి! నీది ఒక జన్మేనా
లోకం
మారాలంటావు
జనం మారి
పోవాలంటావు
నీలో
మార్పుకై ప్రయత్నం చేయవు
మనిషి ఓ
మనిషి! నీది ఒక జన్మేనా
--------------------- అర్జున