మనస్సు


మనస్సు చంచలమైనది ----
             ఒక పనిని చేయమంటుంది
             దాన్నే చేయొద్దంటుంది

మనస్సు సున్నితమైనది
----
             చిన్న విషయానికే సంతోషిస్తుంది
             దానికన్నా చిన్నవిషయానికే బాధపడుతుంది

మనస్సు ఖటినమైనది ----
              ప్రేమను పంచుతుంది
/ పెంచుతుంది
              ఆ ప్రేమనే తుంచుతుంది

మనస్సు జటిలమైనది -----
             మనిషిని మనిషిగా ఉంచుతుంది
              మనిషిని మృగాన్ని చేస్తుంది

ఓ మనిషి మనస్సుని అదుపులో ఉంచుకో
!
ఓ మనిషి మనస్సుని అదుపులో ఉంచుకో
! లేదా ........
                                             మృగాన్ని చేస్తుంది


                               --------------------- అర్జున