ఉషోదయం తప్పదు ప్రతి నిశీధి తరువాత
పౌర్ణమి రాక మానదు అమావాస్య తరువాత
వర్ష ఋతువు నేనున్నానంటుంది గ్రీష్మమ్ తరువాత
ప్రయత్నిస్తే గెలుపు నీదే ఓటమి తరువాత
రోజులు అన్నీ ఒకేలా ఉండవు అన్నది సత్యం
ప్రయత్నం ముఖ్యం, ఫలితం
కాదన్నది గీతా సారం
కష్టం ఇవ్వకపోదు కోరుకున్న ఫలితం అన్నది భారతీయ తత్వం
చేయి నువ్వు నీ ప్రయత్నం... దశ దిశ మారతాయన్నది లిఖితమ్!
--------------------- అర్జున