ఆనందం... అవధి లేని ఆనందం



అవధి లేనిది ఆనందం..

విరగ కాసిన పైరుని చూస్తే ఆనందం
సిరిమల్లెల పరిమళ్ళాల్లో ఆనందం
జలపాతపు ఝరిలో ఆనందం

అమ్మ చేతి స్పర్శలో ఆనందం
చంటిపాప బోసి నవ్వులో ఆనందం
పండు ముదుసలి తృప్తిలో ఆనందం

ప్రతి గెలుపులో ఆనందం
కొన్ని ఓటముల్లో ఆనందం
నీ చుట్టూ ఎన్నింటిలోనో ఆనందం

ఆస్వాదించడం నేర్చుకో ఎందుకంటే....
అవధి లేనిది ఆనందం....... అంతం కానిది ఈ ఆనందం...

                                  --------------------- అర్జున