నేటి
మనిషికి
మానం
అంటే భయం.....చెడగోడ్తారేమోనని
ప్రాణమంటే
భయం......తీసేస్తారేమోనని
నేటి
మనిషికి
ప్రశ్న
అంటే భయం.....జవాబు దొరకదేమోనని
జవాబంటే
భయం......ఏమి వినాల్సివస్తుందోనని
నేటి
మనిషికి
లక్షం
అంటే భయం.....చేరలేమోనని
గమ్యం
అంటే భయం......ఎదురు దెబ్బలు తగులుతాయేమోనని
నేటి
మనిషికి
దేవుడంటే
భయం..... కోరికలు తీర్చడేమోనని
నాయకులంటే
భయం...... ఏమి కోతరారోనని
నేటి
మనిషికి
బ్రతుకంటే
భయం.....బ్రతకలేనేమోనని
చావంటే
భయం......బ్రతకనివ్వదని
ఒక్క
మాటలో చెప్పాలంటే......నేటి మనిషికి
భయమంటే
భయం....భయపెడుతుందేమోనని
--------------------- అర్జున